ఇంటెన్స్ లవ్ డ్రామా… నీరో ఫస్ట్ స్పార్క్

November 28, 2026


img

అరవింద్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘నీరో’. కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ లవ్ డ్రామా సినిమాలో హారిక నారాయణ్, శివాజీ, ప్రవీణ్, రఘు కుంచె, అశ్రిత వేముగంటి, దీప్తి నల్లమోతు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఫస్ట్ స్పార్క్ పేరుతో నేడు విడుదల చేసిన టీజర్‌లో గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాట అన్నీ అద్భుతంగా ఉన్నాయి కానీ హీరోయిన్‌ రొమ్ముపై హీరో పెన్నుతో ప్రేమ గురించి వ్రాయడం బహుశః వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.

 ఈ సినిమాకు సంభాషణలు:  అశోక్ పొడపాటి, సంగీతం: ఓషో వెంకట్, సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్:  జి.మునిశేఖర్, ఫైట్ మాస్టర్: రామ్ కృష్ణన్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు. 

ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా గోల్డ్ మౌంటైన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. నీరో రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/JGdB3UwLhDs?si=aHiuJa8oMgOxSmZO" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష