బిజేపికి డీఎంకే మద్దతు.. ఇండీ కూటమిలో కలకలం

November 29, 2026


img

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లులను కాంగ్రెస్‌, ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే పార్టీ ఈ బిల్లులకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత స్టాలిన్ ప్రకటించడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉలిక్కి పడింది.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రేపు (సోమవారం) ఈ బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం (సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే)లతో సహా పలువురు సీనియర్ నేతలు స్టాలిన్‌ను కలిసేందుకు నేడు హడావుడిగా చెన్నై బయలుదేరివెళుతున్నారు. అలాగే మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధినేత శరత్ పవార్‌తో కూడా వారు భేటీ కాబోతున్నట్లు సమాచారం. 

అయితే తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజార్టీ రానప్పుడు, డీఎంకేతో మూడు దశాబ్దాల అనుబందం తెంచుకొని హడావుడిగా విజయ్‌కి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.

నాడు డీఎంకే పార్టీకి చేసిన నమ్మకద్రోహం మరిచినట్లు కాంగ్రెస్‌ అధిష్టానం మళ్ళీ  ఇప్పుడు ఆయనను బ్రతిమాలుకోవడానికి బయలుదేరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే సోనియా, రాహుల్  గాంధీలు స్వయంగా వచ్చి బ్రతిమాలుకున్నా స్టాలిన్ అంగీకరిస్తారనుకోలేము.


Related Post