కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ‘జైలర్-2’ ట్రైలర్ విడుదలైంది. ఊహించినట్లే రజనీమార్క్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ చూపారు.
జైలర్-2లో రమ్యకృష్ణ, ఎస్.జే. సూర్య, యోగిబాబు, మీర్నా, అన్నారాజన్, జతిన్ సరనా సూరజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ నటులు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, వినాయకన్, విజయ్ సేతుపతి అతిధి పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్; సంగీతం: అనిరుద్ రవిచందర్; కెమెరా: విజయ్ కార్తీక కన్నం; ఆర్ట్: డిఆర్ కిరణ్; స్టంట్స్: చేతన డిసౌజా; ఎడిటింగ్: ఆర్ నిర్మల్ చేశారు.
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన జైలర్-2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.