రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ఏకంగా రూ.150 కోట్లు వసూళ్ళు సాధించింది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18న తెలుగులో విడుదల కాబోతోంది. తెలుగు ట్రైలర్ నిన్న విడుదల చేశారు.
ఇది 1900-73 మద్య కాలంలో జీవించిన హనుమాన్ భక్తుడు, ప్రముఖ ఆద్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితగాథ ఆధారం తీసిన ఈ సినిమాలో బాబాగా శోభిత్ శ్రీవాత్సవ నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. శోభినవ్ సత్యా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు ఇతర పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: విశాల్ చతుర్వేది, సంగీతం: ధీరేంద్ర ముల్కల్వార్, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది చేశారు. సినిమాటోగ్రఫీ: విశాల్ బావా, ఎడిటింగ్: శంఖ్ రాజాధ్యక్ష, పాటలు: సాధు తివారీ, రిషి పాఠక్, శ్రేయస్ ధర్మాధికారి, శంతను సుదామే చేశారు,
స్వంభు మీడియా నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాగిణి ఎస్. నమ్రత జి. సింగ్, అనుప్రియా ఎ.నగర్, విశాల్ చతుర్వేది కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా ఈ నెల 18న తెలుగులో విడుదల కాబోతోంది.