శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో మోస్ట్ వాంటడ్ మావోయిస్టుగా శ్రీవిష్ణు నటించారు. ఇలాంటి గంభీరమైన సినిమాలో కామెడీ జొప్పించి పండించడం మామూలు విషయం కాదు. కానీ దర్శకుడు జానకీ రామ్ మారెళ్ళ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ఇలాంటి ప్రయోగం చేసినట్లు అనిపిస్తోంది.
ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేశారు.
స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది.