శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తీసిన ‘భారతీయుడు’ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కనుక మళ్ళీ వారిద్దరి కాంబినేషన్‌లోనే దానికి సీక్వెల్‌గా తీసిన ‘భారతీయుడు 2’ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక బోర్లా పడింది.
కనుక అక్కడితో భారతీయుడు కథ ముగిసిపోయినట్లే అని అందరూ భావించారు. కానీ ‘భారతీయుడు 3’తో వస్తున్నామంటూ ఈరోజు ఓ అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు.
‘వార్ మోడ్’ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌లో అవినీతిని ఏమాత్రం సహించని సేనాపతి మరోసారి బరిలోకి దిగుతున్నట్లు చూపించారు.
‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ సమయంలో కమల్ హాసన్ మాట్లాడుతూ కొందరికి భారతీయుడు1 అంటే ఇష్టమని, మరికొందరికి భారతీయుడు 2 అంటే ఇష్టమని నాకు మాత్రం భారతీయుడు 3 అంటేనే ఎక్కువ ఇష్టమని అప్పుడే ఈ సినిమా గురించి హింట్ ఇచ్చేశారు.
కానీ భారతీయుడు 2 నిరాశపరచడంతో నాడు అయన చెప్పిన ఈ మాటని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఇద్దరూ ఎదురు దెబ్బ తిన్నప్పటికీ పరస్పర నమ్మకంతో భారతీయుడు 3తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కనుక కనీసం భారతీయుడు 3తోనైనా ప్రేక్షకులను మెప్పించగలరని ఆశిద్దాం.