తమిళనాడు సిఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ సినీ పరిశ్రమలో దర్శకుడుగా అడుగుపెట్టి, సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తీసిన ‘సిగ్మా’తో మొదటి ఎదురుదెబ్బ తిన్నాడు. బహుశః ఆ షాక్ వల్లనేమో మెగాఫోన్ పక్కన పెట్టేసి ఈసారి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అతనితో ‘సిగ్మా’ నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ రూ. 35 కోట్లు బడ్జెట్‌తో ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నట్లు తాజా సమాచారం.
అతని తండ్రికి సినీ పరిశ్రమలో ఉన్న పరిచయాలు, సిఎంగా ఉన్న పరపతి, లక్షల మంది అభిమానులని దృష్టిలో పెట్టుకొని ఈ సాహసం చేసేందుకు నిర్మాణ సంస్థ సిద్దపడుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.