రవితేజ 78వ సినిమా టైటిల్‌

October 09, 2026


img

మాస్‌ మహారాజా రవితేజ తన 78వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవునో కాదో ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు తెలుస్తుంది.  

నాచురల్ స్టార్ నానితో ‘సరిపోదా శనివారం’ సినిమా చేసిన వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా, అనశ్వర రాజన్‌, జేడీ చక్రవర్తి, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. 

ఈ సినిమాను బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై లక్ష్మణ్‌, శ్రీనిరావు కలిసి నిర్మిస్తున్నారు. టైటిల్‌ ప్రకటనతో పాటు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష