రామాయణంలో జటాయువుగా అనుపమ్ ఖేర్!

October 13, 2026


img

సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ నుంచి జటాయువు పోస్టర్‌ విడుదలైంది. రావణుడు సీతమ్మవారిని ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువనే పక్షి అడ్డుకునేందుకు ప్రయత్నించి రావణుడి చేతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. 

జటాయువుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ‘ది వింగ్స్ ఆఫ్ ధర్మ’ పేరుతో విడుదల చేసిన పోస్టర్‌లో జటాయువు రూపం ఆకట్టుకుంటోంది. జటాయువు రూపంలో చూచాయగా కనిపిస్తున్న అయన ముఖం చూపారు. 

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. 

రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష