తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్ళు పెంచింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్ళు, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖలలో ఉద్యోగాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
తెలంగాణ ఏర్పాటులో నియామకాలు కూడా ప్రధాన అంశంగా పరిగణించారు కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వయోపరిమితి 5 ఏళ్ళు పెంచి నిరుద్యోగులకు ఉపశమనం కల్పించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండేళ్ళు పొడిగించి వరుసపెట్టి జాబ్ నోటిఫికే షన్స్ విడుదల చేస్తుండటంతో నిరుద్యోగ యువతకు మరో అవకాశం కల్పించినట్లయింది.
ఈ రెండేళ్ళ పెంపుకు సంబంధించి జీవో ఈ ఏడాది మే 18న విడుదల చేసినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్‌లకు కూడా ఇది వర్తిస్తుంది.