ఈగల్ ఫోర్స్ చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఒడిశా నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41.01 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బస్సుతో పాటు గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన ప్రైవేట్ బస్సులో భారీగా గంజాయి హైదరాబాద్ వస్తోందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి నగర శివారులో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ బస్సుని ఆపి తనిఖీ చేయగా, రహస్యంగా ఏర్పాటు చేసిన అల్మారాలో నుంచి 41.01 కిలోల గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు రూ.20.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్న పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నగరంలో ఎవరికి సరఫరా చేయబోతున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరున్నారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితులు పూర్తి సమాచారం వెల్లడిస్తే హైదరాబాద్‌లో పనిచేస్తున్న మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.