జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్‌పై ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ గట్టిగా డోస్ ఇచ్చారు. ఇప్పుడు నటి హేమ కూడా ఆయనకు మరో డోస్ ఇచ్చారు.
“మీరు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి ‘దొర’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. అది చూసి నా మనసు చివుక్కు మంది. తెలంగాణలో ఆ పదాన్ని ఎ ఉద్దేశ్యంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాలు నచ్చకపోతే విమర్శించండి.
కూటమి ప్రభుత్వం, జనసేన విధానాలలో లోపాలు ఉంటె విమర్శించండి తప్పు కాదు. కానీ పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించకండి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటివారో కోట్లాది మంది ప్రజలకి తెలుసు,” అని ప్రకాష్ రాజ్‌కు హితవు పలికారు.
ఈ సందర్భంగా ఆమె సినిమా షూటింగ్‌లలో అయన తీరు ఏవిధంగా ఉంటుందో బయటపెట్టారు. “నేను చాలా సినిమాలలో మీ భార్యగా నటించాను. మీరు ఈరోజు షూటింగ్‌కి వస్తానని డేట్ దర్శక నిర్మాతలకి డేట్ ఇస్తారు. మేమందరం పొద్దునే సెట్స్‌కి వచ్చేసి మేకప్ వేసుకొని మీ కోసం ఎదురుచూస్తుంటాము పది నిమిషాల్లో వస్తారని.. అర్ధ గంట... రెండు గంటల్లో వస్తారని... లంచ్ తర్వాత తప్పక వస్తారని అలా సాయంత్రం ప్యాకప్ చెప్పేవరకు అందరం ఎదురుచూస్తూనే ఉంటాము. తర్వాత తాపీగా మీరు ఫోన్ చేసి ఈరోజు మూడ్ లేదు కనుక వేరే కంట్రీకి వెళ్ళిపోయానని చెప్తారు. కనీసం ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా? కానీ చెప్పరు.
షూటింగ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే మీరు ఇతరులను విమర్శిస్తూనే ఉంటారు. ఇలా వ్యవహరించే వారందరూ ఏమైపోయారో చరిత్ర చూస్తే మీకే అర్ధమవుతుంది. మీరు రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారా? తప్పకుండా రండి. కానీ అప్పుడు సింగిల్‌గా వస్తారా లేదా గుంపులతో వస్తారా? రాజకీయాలలో దిగి ప్రజాసేవ చేసే మూడ్‌లో ఉన్నారా లేదా? దయచేసి చెప్పండి ప్రకాష్ రాజ్ గారు,” అని హేమ కూడా వ్యంగ్యంగా అడిగారు.
రాజకీయ ప్రయోజనాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత హననానికి పాల్పడవద్దంటూ నటుడు ప్రకాష్ రాజ్‌కు నటి హేమ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పవన్‌ను రాజకీయంగా విమర్శిస్తే తప్పులేదని, కానీ వ్యక్తిగత విమర్శలు చేసిన వారి గత చరిత్ర ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. pic.twitter.com/GePApfLIky