అప్పుడు కేసీఆర్‌ హయంలో అవినీతి, ఇప్పుడు... కల్వకుంట్ల కవిత

June 06, 2026


img

అప్పుడు కేసీఆర్‌ హయంలో అవినీతి, ఇప్పుడు... కల్వకుంట్ల కవిత    

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడుతూ మళ్ళీ తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌ వారి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు కేసీఆర్‌ హయంలో అవినీతి జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలోను జరుగుతోంది. నాడు కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి కిటికీలు తెరిస్తే, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా తలుపులు బార్లా తెరిచేసి లక్ష కోట్లు కొట్టేస్తోంది. 

నాడు కేటీఆర్‌ అంటే కేసీఆర్‌, హరీష్‌ రావు, రామారావు కాగా నేడు వారి స్థానంలో రేవంత్ రెడ్డి, కొండల్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి అన్నట్లు అవినీతి పాలన సాగుతోంది. 

నేను టీఆర్ఎస్‌ పార్టీ స్థాపించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి గట్టిగా నిలదీసిన తర్వాతే రేవంత్ రెడ్డి హడావుడిగా పాలమూరు వెళ్ళి ప్రగల్భాలు పలికారు. అబ్ కీ బార్ కాంగ్రెస్‌ అని నినాదం ఇచ్చారు. కానీ ఇదే ఆకరీ బార్ కాంగ్రెస్‌ అని నేను చెప్తున్నా. మరోసారి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే ఇవ్వరు తెలంగాణ ప్రజలు. రాష్ట్రంలో బిజేపికి చోటే లేదు. ఎలా రావాలనుకుంటోందో దానికే తెలియాలి,” అని అన్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఇక్కడ చాలా పార్టీలు, నాయకులు ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్‌ ప్రజలకు సేవ చేయాలనుకుంటే అదేదో ఏపీలో ప్రజలకు సేవ చేసుకోమని కల్వకుంట్ల కవిత ఉచిత సలహా ఇచ్చారు.


Related Post