చర్చలు ప్రారంభం కాక ముందే విఫలం!

April 20, 2026
img

అమెరికా-ఇరాన్‌ మద్య రేపు ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరగాల్సి ఉండగా వాటిలో తాము పాల్గొనడం లేదని ఇరాన్‌ ప్రకటించింది. 

ఓ పక్క తమ సరుకు రవాణా నౌకలను అమెరికా యుద్ధ నౌకలు దిగ్బందిస్తున్నాయి. ఇరాన్‌ పట్ల అమెరికా కటినమైన ఆంక్షలు విధిస్తోంది. చర్చల విషయంలో కొత్త కొత్త షరతులు పెడుతోంది. ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదు.

ఈసారి శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌ మీద భీకర దాడులు చేసి నాశనం చేస్తామని ట్రంప్‌ బెదిరింపులని ఇరాన్‌ తీవ్రంగా తప్పు పట్టింది. ఈవిధంగా తన నుదుటన తుపాకీ పెట్టి శాంతి ఒప్పందంపై సంతకం చేయమంటే చేయలేమని ఇరాన్‌ స్పష్టం చేసింది.

అమెరికా నిలకడ లేని వైఖరితో వ్యవహరిస్తునంత కాలం శాంతి చర్చలు సాధ్యం కావని ఇరాన్‌ తెగేసి చెప్పింది. 

ఈ నెల 22 వరకు ఇరాన్‌కి ట్రంప్‌ గడువు పెట్టారు. కనుక ఇరాన్‌ ప్రకటనతో ప్రపంచ దేశాలు మళ్ళీ ఉలిక్కి పడ్డాయి. మధ్యవరిత్వం చేస్తున్న పాకిస్తాన్‌, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వెంటనే రంగంలో దిగి ఇరాన్‌ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ ట్రంప్‌ వైఖరి మారనప్పుడు ఇరాన్‌ ఎన్ని మెట్లు దిగుతుంది? ఇరాన్‌ సహనానికి కూడా హద్దుంటుంది కదా?

Related Post