మహిళల కోసం హైదరాబాద్‌లో స్త్రీ రైడ్ ప్రారంభం

June 06, 2026
img

హైదరాబాద్‌ నగరంలో మహిళల భద్రతకు నగర పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా మహిళల కోసం మహిళలే నడిపే ఈ-బైక్స్, ఈ-ఆటో రిక్షాలని డీజీపీ సీవీ ఆనంద్‌ నేడు జెండా ఊపి ప్రారంబించారు. ‘స్త్రీ రైడ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ సేవలో తొలివిడతలో 55 మహిళలకు అంబర్‌ పేట పోలీస్ లైన్స్‌లో టూవీలర్, త్రీ వీలర్ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ, లైసెన్స్ ఇచ్చారు. వీరు నగరంలో స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలలో డెలివరీ సేవలు కూడా అందిస్తారు. మరో నాలుగు నెలల్లో మరో 150-200 మందికి శిక్షణ ఇచ్చి వారి సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు.

స్త్రీ రైడ్ ద్వారా నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే మహిళలకు భద్రత కల్పించడం, అలాగే మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఇది ప్రారంభించినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో మహిళా భద్రతా విభాగం, రాష్ట్ర రవాణా శాఖ కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి.

Related Post