మొన్న ప్రమాణ స్వీకారం నిన్న రాజీనామా!

June 05, 2026


img

కర్ణాటక సిఎం పదవిని డీకే శివకుమార్ దక్కిన్చుకోగాలిగారు. కానీ అయన మంత్రి వర్గంలో మంత్రులను కాపాడుకోలేకపోతున్నారు. రామలింగా రెడ్డి బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు సిఎం సాగునీటి శాఖ కేటాయించడంతో అలిగి ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. తాను నగరాభివృద్ధి శాఖ ఇస్తానని సిఎం హామీ ఇచ్చారు. కానీ వేరే శాఖ కట్టబెట్టారు. నాకిష్టం లేని శాఖలో నేను పనిచేయలేను. కనుక రాజీనామా చేస్తున్నాను,” అంటూ మీడియా ప్రతినిధుల సమక్షంలోనే రాజీనామా లేఖపై సంతకం చేశారు. 

సిఎం డీకే శివకుమార్ స్పందిస్తూ “రామలింగా రెడ్డి నా సహచరుడు పార్టీలో సీనియర్ నాయకుడు. అయన గ్రామీణ ప్రాంతాలలో పనులను పర్యవేక్షించలేనని భావిస్తున్నట్లున్నారు. ఆయనతో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటాము,” అని చెప్పారు. 

ఈలోగా మరో మంత్రి కేహెచ్ మునియప్ప కూడా ఇదే కారణంతో అలకపాన్పు ఎక్కారు. “నా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా నాకు ఆహార, ప్రజా పంపిణీ శాఖను కట్టబెట్టారు. నేను వ్యవసాయ లేదా సామాజిక సంక్షేమ శాఖని కోరుకుంటే వేరే శాఖని కట్టబెట్టడం సరికాదు,” అని అన్నారు. 


Related Post