నేడు హైదరాబాద్‌లో చెన్నై లవ్ స్టోరీ సక్సస్ మీట్‌లో ప్రముఖ సినీ పాటల రచయిత అనంత శ్రీరాం మూవీ రివ్యూలు వ్రాసేవారికి తనదైన శైలిలో చురకలు వేశారు.
శ్రీరాం ఏమన్నారంటే, “ సోషల్ మీడియాలో మనకి అకౌంట్ ఉంది కనుక ఏమైనా వ్రాసేయోచ్చని కొందరు అనుకుంటారు. అలాంటి వారు సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు.. కానీ సెకండాఫ్ చాలా డల్,’ అని కామెంట్స్ చేస్తుంటారు.
కానీ ఇదే రైటింగ్ మలయాళంలో ఉంటే ‘మ్యాజిక్’ అంటారు. తమిళ సినిమాలో ఉంటే ‘టెర్రిఫిక్’ అంటారు. కన్నడ సినిమాలో ఉంటే ‘క్లాసిక్’ అంటారు. అదే హిందీ సినిమాలో ఉంటే ‘హోలిస్టిక్’ అంటారు. కానీ తెలుగు సినిమాకి వచ్చేసరికి ప్యానిక్ అయిపోయి ‘పాండమిక్’ అంటారు,” అని చురకలు వేశారు.
నిజమే కదా?ఇతర భాష చిత్రాలు ఎలాగున్నా బాగానే ఉన్నాయనుకునే రివ్యూలు వ్రాసేవారు తెలుగు సినిమాల గురించి అంత చులకనగా ఎందుకు వ్రాస్తారో?వారికే తెలియాలి.
సినిమా బాగుందో లేదో చూసిన ప్రేక్షకులు చెప్పాలి. వారే నిర్ణయించుకోవాలి. కానీ రివ్యూలు వ్రాసేవారు తమకు సినిమా నచ్చకపోతే లోకంలో ఎవరికీ నచ్చదన్నట్లు వ్రాసేస్తుంటారు.
అలాంటి రివ్యూలు వలన బాగా ఆడాల్సిన సినిమాలు కూడా దెబ్బ తింటాయి. నిర్మాతలు తీవ్రంగా నష్టపోతుంటారు. కనుక కనీసం ఓ వారం పది రోజులు ప్రేక్షకులను సినిమాలు చూడనిచ్చి ఆ తర్వాత మీ అభిప్రాయలు చెప్పాలని పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు చెపుతూనే ఉంటారు.
కానీ రివ్యూలు వ్రాసేవారు ఆగడం లేదు. కనుక అనంత శ్రీరాం వంటివాళ్ళు అప్పుడప్పుడు ఇలా చురకలు వేస్తూనే ఉంటారు.