దుల్కర్, పూజా.. బొమ్మ బొమ్మ ఫస్ట్ సింగిల్

July 28, 2026


img

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ నుంచి  ‘బొమ్మ బొమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. 

మెలోడీ టచ్‌తో సాగుతున్న ఈ పాటలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వినసొంపైన సంగీతం, ఆహ్లాదకరమైన విజువల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.‘బొమ్మ బొమ్మ’ పాటకు రామ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, అశ్విన్ సత్య ప్రోగ్రామింగ్ అందించారు. 

రవి నెలకుడిటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధీక్షిత్ శెట్టి, జగపతిబాబు, రమ్యకృష్ణ, సచిన్ ఖేడ్కర్, రావు రమేశ్, సంగీత నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: రవి నెలకుడిటి; సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్‌, కెమెరా: అనయ్ ఓం గోస్వామి; ఎడిటింగ్: కొటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు. 

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష