నేనెక్కడికీ పారిపోలేదు: ఉదయ్ కృష్ణారెడ్డి

July 28, 2026
img

Trainee IPS Officer Uday Kiran Reddy said that he didn’t flee away instead co-operating to the police officers inquiring his case.  


హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. “నేను ఎక్కడికీ పారిపోలేదు. మా నానమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రకాశం జిల్లాలోని నా స్వస్థలం ఊళ్ళ పాలెంకు వచ్చాను. నేను ఇక్కడే మా ఊళ్ళో ఉన్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. కానీ నాపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదైంది. నాకు పోలీస్, న్యాయ వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది. కనుక తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. 

హైదరాబాద్‌లో నా పేరిట పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు విన్నాను. కానీ నా శాశ్విత చిరునామా హైదరాబాద్‌లో లేదు. ఇక్కడ ఊళ్ళపాలెంలో ఉంది. ఇక్కడకి ఎటువంటి నోటీసులు రాలేదు. కానీ పోలీసులు హైదరాబాద్‌ చిరునామాకి నోటీసులు పంపినట్లు తెలిసింది కనుక తక్షణం నేను హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తాను.  ఈ కేసు విచారణలో పోలీసులకు నేను పూర్తిగా సహకరిస్తాను,” అని ఉదయ్ కృష్ణారెడ్డి అన్నారు.

Related Post