హైడ్రా కమీషనర్‌ రంగనాథ్ బదిలీ తప్పదా?

July 28, 2026


img

హైడ్రా కమీషనర్‌ రంగనాథ్ తరచూ కోర్టు ఉత్తర్వులు ధిక్కరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనని తక్షణం ఆ పదవిలో నుంచి తొలగించి వేరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “బతుకమ్మ కుంటలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఘనుడు ఓ బీఆర్ఎస్‌ నాయకుడు. ఆయన వంటి కొందరు కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్ తో కోర్టుని తప్పు దోవ పట్టిస్తున్నారు. 

కబ్జాదారులను కాపాడేందుకు సోషల్ మీడియాలో కూడా మా ప్రభుత్వానికి, హైడ్రాకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

కానీ నగరంలో వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడింది. కబ్జాదారుల చేతిలో చిక్కుకున్న విలువైన భూములను మళ్ళీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకువచ్చింది. కనుక హైడ్రా యధాతధంగా కొనసాగుతుంది.  హైడ్రాతో సహా ఏయే అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు తీర్పుపై సమీక్షించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.        



Related Post