నెట్‌ఫ్లిక్స్‌లోకి రావు బహదూర్

July 28, 2026


img

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ డ్రామా జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఒకేసారి ఐదు భాషల్లో ఓటీటీలోకి ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

సత్యదేవ్ ప్రధాన పాత్ర చేసిన ‘రావు బహదూర్’లో సందేహం మనిషి జీవితాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనే ఆసక్తికరమైన అంశాన్ని దర్శకుడు వెంకటేశ్ మహా తనదైన శైలిలో చూపించారు.

సత్యదేవ్ సరసన దీపా థామస్ కీలక పాత్రలో నటించారు. వికాస్ ముప్పాళ్ళ, ఆనంద్ భారతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి ప్రశంసలు దక్కగా, సినిమా మేకింగ్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ‘రావు బహదూర్’ ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష