ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబు

July 28, 2026


img

ఇదివరకు వెంకటేష్‌ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘వాసు’ మూడు సూపర్ హిట్ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇప్పుడు తొలిసారిగా వెంకటేష్‌తో కలిసి త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47’ సినిమా చేస్తున్నారు.

ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 ని ఇంగ్లీషులో ‘ఏకే-47’ అని పేర్కొనడంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. వెంకటేష్‌ మార్క్ కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో వెంకటేష్‌  పాత్రను చిట్టిబాబుగా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌ ఇందుకు ఓ చిన్న శాంపుల్.. ఆదర్శ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి! 

ఆదర్శ కుటుంబంలో వెంకటేష్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజా ప్రజ్వల్, రావు రమేష్, రఘుబాబు, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: థమన్ ఎస్; కెమెరా: రవి కె. చంద్రన్; ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్, యాక్షన్: కెవిన్ కుమార్‌ చేస్తున్నారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్న ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/ZNaElu5YQ5g?si=CWiQMbvQ0xCDBAJW" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష