మీరు ప్రేమించే అమ్మాయి ఎదుట కాలక్షేపం చేయడం బెటర్!

July 28, 2026


img

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏటా హైదరాబాద్‌లో అభిమానులని ముఖాముఖీ కలుస్తుమ్తారు. ఈ సందర్భంగా వారితో తను చేసిన, చేయబోయే సినిమాలు, మంచి చెడులు, ప్రశంశలు, విమర్శలు, అభిమానుల అభిప్రాయలు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఈ సందర్భంగా వారితో అల్లు అర్జున్‌ సేల్ఫీలు దిగుతారు. 

ఇదేవిధంగా అల్లు అర్జున్‌ నేడు హైదరాబాద్‌లో ఓ హోటల్లో అభిమానులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హీరోల అభిమానులు పరస్పరం విమర్శించుకోవడం గురించి మాట్లాడుతూ, “మనకు నచ్చని వాళ్ళ గురించి ఆలోచించడం, వారిని విమర్శించేందుకు మన సమయం, ఎనర్జీ వృధా చేసుకోవడం దేనికి?ఆ సమయం, ఎనర్జీ మీకు ఉపయోగపపనులకు లేదా మీరు జీవితంలో రాణించేందుకు ఖర్చు చేసుకుంటే మంచిది కదా? నచ్చనివాళ్ళ కోసం మీ సమయం, మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం కంటే మీరు ప్రేమించే అమ్మాయి ఇంటి ముందు కాసేపు కాలక్షేపం చేస్తే కనీసం ఆ కొద్దిపాటి సమయం మీకు సంతోషం కలిగిస్తుంది కదా? దానిని ఆస్వాదించండి. అంతేగానీ నచ్చని వారి కోసం నచ్చని పనులు చేయొద్దు. ఎవరైనా నచ్చలేదా? వదిలేయ్... ముందుకు సాగిపో.. “ అని అల్లు అర్జున్‌ అభిమానులకు హితవు పలికారు. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఆ గ్యాప్‌లో అభిమానులతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష