నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు మంచి ఆసక్తికరంగా సాగుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్-10 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశాయి స్టార్ మా-జియో హాట్ స్టార్ సంస్థలు.
“బిగ్ బాస్... ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఏంటో మంది హృదయాలు గెలుచుకున్న హరీష్ రావు సామ్రాజ్యం,” అంటూ నాగార్జున చెప్పే డైలాగుతో రిలీజ్ చేసిన వీడియోతో దీనికీ ఆయనే హోస్టింగ్ చేయబోతున్నారని స్పష్టం చేసింది. దీనికి ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే క్యాప్షన్ పెట్టారు.
బిగ్ బాస్ సీజన్-9లో సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇవ్వగా, కళ్యాణ్ పడాల అనే సామాన్య వ్యక్తి విన్నర్‌గా నిలిచారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్-10లో పాల్గొనబోయేవారి పేర్లు, షెడ్యూల్ ప్రకటించనున్నారు.