నాడు నన్ను వదులుకున్నట్లే ఇప్పుడు అన్నామలైని..

June 05, 2026


img

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తమిళనాడు మాజీ బిజేపి అధ్యక్షుడు అన్నామలై పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే బిజేపి అధిష్టానం ఆయనకి నచ్చజెప్పి పార్టీలో కొనసాగేలా చేయాల్సింది. కానీ అయన ఎందుకు రాజీనామా చేస్తున్నారో కూడా అడగకుండా అంత మంచి నాయకుడిని వదులుకుంది. 

అయన బిజేపి సిద్దాంతాల పట్ల ఆకర్షితుడై ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి పార్టీ కోసం చాలా పాటు పడ్డారు. అయన చేరిన తర్వాతే తమిళనాడులో బిజేపి బలోపేతం అయ్యింది. అలాంటి నిబద్దత కలిగిన నాయకుడిని వదులుకోవడం చాలా పొరపాటు. 

నాడు నా విషయంలో బిజేపి అధిష్టానం ఏవిధంగా వ్యవహరించిందో ఇప్పుడు అయన విషయంలో కూడా సరిగ్గా అలాగే వ్యవహరించింది. రాష్ట్ర బిజేపిలో పరిస్థితిని నేను ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేస్తూ పరిస్థితి చెయ్యి దాటిపోక ముందు సరిచేయాలని కోరుతూ ఉండేవాడిని. అందుకు నేనే పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేశారు. 

పార్టీకి రాజీనామా చేసినా ఇంతవరకు నేను వేరే పార్టీలో చేరలేదు. ఎందుకంటే నేను హిందుత్వ అజెండాకు కట్టుబడి ఉన్నాను కనుక,” అని రాజా సింగ్ అన్నారు.


Related Post