ప్రధాని మోడీకి యూఏఈ అరుదైన స్వాగతం

May 15, 2026
img

ప్రధాని మోడీ యూరప్ పర్యటనలో భాగంగా ముందుగా నేడు యూఏఈ చేరుకున్నారు. ఆయనకు యూఏఈ ప్రభుత్వం అరుదైన స్వాగతం పలికింది. ప్రధాని పయనిస్తున్న విమానం యూఏఈ గగనతలం పరిధిలోకి చేరుకోగానే ఆ దేశ వాయుసేనకు చెందిన ఎఫ్-16 డెజర్ట్ ఫాల్కన్ యుద్ధ విమానం రక్షణగా వచ్చింది.

ప్రధాని మోడీ పయనిస్తున్న విమానానికి సమీపంలోనే అది కూడా పయనిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్‌ ప్రధానికి ఇటువంటి అరుదైన గౌరవం లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఆ దేశంతో ఎల్పీజీ సరఫరా, పెట్రోలియం నిల్వలు ఒప్పందాలు, నౌకల మరమత్తులు, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం తదితర అంశాలపై ఇరు దేశాల మద్య ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈపై ఇరాన్‌ దాడులను ఖండించారు. హోర్మూజ్ జలసంధి విషయంలో అంతర్జాతీయ చట్టాలకు ఇరాన్‌ కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే యావత్ ప్రపంచ దేశాలు ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది కనుక శాంతి చర్చలతో సమస్యని పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

Related Post