పశ్చిమాసియా యుద్ధం వలన పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత అంటూ ఇప్పటికే చమురు కంపెనీలు ఎడాపెడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూనే ఉన్నాయి. మళ్ళీ శనివారం అర్ధరాత్రి మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశాయి.
ఒక్కో సిలిండర్ ధర రూ.29 చొప్పున పెంచేశాయి. దీంతో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఛార్జీతో కలిపి రూ. 1,000కి చేరింది. కొన్ని పెద్ద నగరాలలో వెయ్యి దాటిపోయింది.
సరిగ్గా మూడు నెలల క్రితం ఇదే రోజున అంటే మార్చి 7న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 చొప్పున పెంచాయి. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. కనుక మున్ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో జోరుగా యుద్ధం సాగుతున్నప్పుడు దేశంలో గ్యాస్ కొరత లేనే లేదు. అమెరికా, రష్యా, ఇరాన్ దేశాలతో మాట్లాడి భారత్‌కు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేకుండా చేస్తున్నాము. ఒక్క భారత్‌లో మాత్రమే ప్రజలపై భారం మోపలేదు.. అంటూ ప్రధాని మోడీతో సహా పలువురు గొప్పలు చెప్పుకున్నారు.
కానీ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే వెంటనే ధరలు పెంచడంతో వాటి కోసమే ఆగారని వారే నిరూపించుకున్నారు.