పశ్చిమాసియా యుద్ధం వలన యావత్ ప్రపంచ దేశాలలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినా భారత్‌లో మాత్రం పెంచలేదని, సామాన్య ప్రజలపై భారం పడకుండా కాపాడుకున్నామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.
కానీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పెంచకుండా ఆపిందని అందరికీ తెలుసు. అందరూ ఊహించినట్లే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వరుసగా నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది.
మళ్ళీ రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మద్య యుద్ధం మొదలయింది కనుక ఇక్కడితో ఈ పెంపు ఆగుతుందనే నమ్మకం కూడా లేదు. దేశీయ చమురు సంస్థలు నిరభ్యంతరంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకోవడం తధ్యం.
సోమవారం మరోసారి పెంచిన ధరలతో పెట్రోల్ లీటరుకి రూ.8.23, డీజిల్ ధర లీటరుకి రూ.8.12 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో తెలంగాణలో పెట్రోల్ ధర లీటరుకి రూ.115.62, డీజిల్ ధర లీటరుకి రూ.103.76కి చేరింది. బహుశః రెండింటి ధరలు లీటరుకి రూ.150 చేరుకున్నా ఆశ్చర్యం లేదు.