మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

May 23, 2026
img

పెట్రోల్, డీజిల్‌ ధరలు మళ్ళీ పెరిగాయి. ఒకేసారి ధరలు పెంచితే ప్రజాగ్రహం, ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోవడం కష్టమని కాబోలు వారానికి 80-90 పైసలు చొప్పున పెంచుకుంటూ వెళ్తున్నట్లున్నారు. నిన్న అర్దరాత్రి నుంచి పెట్రోల్ ధర లీటరుకి 87 పైసలు, డీజిల్‌ ధర లీటరుకి 91 పైసలు చొప్పున పెరిగాయి. .

దీంతో రెండువారాల  వ్యవధిలో రెండింటి ధరలు లీటరుకి రూ.4 నుంచి 5 చొప్పున పెరిగినట్లయింది. గతంలో ఏ యుద్ధాలు జరగనప్పుడే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయంటూ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేస్తుండేవి.

కానీ ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది కనుక ఆ పేరుతో నిర్మొహమాటంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుకోగలుగుతున్నాయి. కనుక పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేది కాదు. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర రూ.150కి, డీజిల్‌ ధర రూ.125కి చేరినా ఆశ్చర్యం లేదు.    

తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరు రూ.112.71 డీజిల్ ధర లీటరుకి రూ.100.86కి చేరింది. 

Related Post