నేడు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

May 22, 2026
img

ఐపీఎల్-2026లో భాగంగా ఈ రోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మద్య మ్యాచ్ జరుగబోతోంది. కనుక మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్‌ నలుమూలల నుంచే కాక చుట్టూ పక్కల జిల్లాల నుంచి కూడా భారీగా క్రికెట్ అభిమానులు రాబోతున్నారు. 

రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత నగర ప్రజలు తిరిగి ఇళ్ళకు చేరుకునేందుకు గాను హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఈరోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్ళు నడుపబోతోంది. 

అయితే అప్పటికప్పుడు టికెట్స్ కొనుగోలు చేసేందుకు క్యూలైన్లలో నిలబడే బదులు ముందుగానే రిటర్న్ టికెట్స్ కొనుగోలు చేయాలని మెట్రో రైల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. లేదా స్మార్ట్ కార్డ్, డిజిటల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించవచ్చని తెలిపారు. 

ఆర్టీసీ సంస్థ కూడా ఉప్పల్ స్టేడియం చేరుకునేందుకు, మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్ళేందుకు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది.     


Related Post