సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రభుత్వం విప్ అదివారం శ్రీనివాస్ ఘాటుగా బదులిచ్చారు. “ముఖ్యమంత్రులు కేంద్రం నుంచి నిధుల కోసం ఢిల్లీ కాకపోతే ఎక్కడికి వెళ్తారు?
టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని జాతీయపార్టీ అని గొప్పగా చెప్పుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీ పార్టీ కార్యాలయం కూడా నిర్మించుకున్నారు. కానీ ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోయారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించారు.
అలాంటి మీకు నెహ్రూ కుటుంబాన్ని విమర్శించడం సిగ్గుచేటు. ప్రజలు మిమ్మల్ని గద్దె దించినా ఇంకా బుద్ధి రాలేదు. అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారని ఆత్మపరిశీలన చేసుకున్నారా? రెండున్నరేళ్ళవుతున్నా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు.
సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకునే ప్రయత్నం చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈవిధంగా మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమే కదా? అని అది శ్రీనివాస్ అన్నారు