వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ మూవీ

August 06, 2026


img

ఇప్పుడు తెలుగు సినిమాలలో పలువురు బాలీవుడ్‌ నటీనటులు కనిపిస్తూనే ఉన్నారు. వారిలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కనిస్తుండటమే విశేషమనుకుంటే, ఇప్పుడు టాలీవుడ్‌ దర్శకత్వం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేస్తుండటం ఇంకా విశేషం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కి జోడీగా నయనతార నటిస్తున్నారు. రాహుల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.      

సల్మాన్ ఖాన్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ నేటి నుంచి ఆరు వారాల పాటు ముంబయిలో జరుగబోతోంది. ఈ షెడ్యూల్‌లో మూడు భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ షెడ్యూల్‌లో నయనతార, రాహుల్ దేవ్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ అక్టోబర్ నాటికి ప్రధాన యాక్షన్ భాగాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష