ఆగస్ట్ 15 నుంచి తెల్ల రేషన్ కార్డులు పంపిణీ

August 06, 2026


img

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఓ శుభవార్త. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 నుంచి తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌరసరఫరా శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 1.05 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డులు అందించాబోతున్నట్లు మంత్రి తెలిపారు.

సిఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న తర్వాత సంగారెడ్డిలో జరిగే సభలో లాంచనంగా తెల్ల రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు.

ఇప్పుడు ఏవైనా కారణాల చేత ఎవరికైనా తెల్ల రేషన్ కార్డులు లభించకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కనుక రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.


Related Post