యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు అవసరమా? హైకోర్టులో పిటిషన్‌

August 05, 2026
img

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడీ)లాగే తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికీ బోర్డు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావించి ఏర్పాటు చేసింది. ఈ మేరకు జూన్‌ 30న జీవో ద్వారా బోర్డు ఏర్పాటు చేసింది. 

అయితే బోర్డు ఏర్పాటుని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరయాణి నరసింహ మూర్తి, నాగిళ్ళ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వందకోట్లు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు బోర్డు ఏర్పాటు చేయవచ్చునంటూ ప్రభుత్వం దానిలో ప్రజాప్రతినిధులకు చోటు కల్పించడం రాజ్యాంగంలోని 24,25 అధికరణాలకు వ్యతిరేకమని పిటిషనర్స్ పేర్కొన్నారు. 

వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్‌గా, ఆలయ ఈవో, చైర్మన్‌ ఎం. సత్యనారాయణ రెడ్డి, సీఎస్. జిల్లా కలెక్టర్, బోర్డు వైస్ చైర్మన్‌, ఆలయ ప్రధాన అర్చకులను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. 

Related Post