నాకు ఒక రాజకీయ కోరిక ఉంది: జగ్గారెడ్డి

July 30, 2026


img

కాంగ్రెస్‌ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన మాట్లాడినా ఏదో కొత్త విషయం చెపుతుంటారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకొక రాజకీయ కోరిక ఉంది. దానిని ఏవిధంగా సాధించుకోవాలో ఖచ్చితమైన ప్లాన్ కూడా ఉంది. రాబోయే మూడు నెలల్లో దానిని  అమలు చేసి సాధించుకుంటాను. నా రాజకీయ కోరిక ఏమిటో నవంబర్‌లో అందరికీ చెప్తాను,” అని అన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఏవైనా సమస్యలుంటే మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడనని, ఢిల్లీ వెళ్ళి నేరుగా రాహుల్‌ గాంధీకే చెప్తానని మాట ఇచ్చానని కనుక పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ఇప్పుడేమీ మాట్లాడదలచుకోలేదన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు సిఎం పదవికి పోటీ పడ్డవారిలో జగ్గారెడ్డి కూడా ఉన్నారు. కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించారు. కానీ అదీ దక్కలేదు. కనుక దాని కోసమే మూడు నెలల కార్యాచరణతో పావులు కదపాలని జగ్గారెడ్డి అనుకుంటున్నారేమో?              



Related Post