సూపర్ సుబ్బు టీచర్‌గా అలరించిన సందీప్ కిషన్ ఈసారి ఫాంటసీ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి ‘కరికాల- ఏ మ్యాజికల్ వరల్డ్’ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
‘శంభాల’ దర్శకుడు ఉగంధర్ ముని దర్శకత్వంలో దీనిని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రకటించారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో డాలు పట్టుకొని గుర్రంపై సవారీ చేస్తుండగా పక్కనే సింహం పరిగేడుతున్నట్లు చూపారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. కరికాల మొదటి భాగం వచ్చే ఏడాది జూలై 2న, రెండో భాగం అక్టోబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే ప్రకటించారు.