నితిన్‌ అలియాస్ రుక్మిణి... టైటిల్‌ గ్లిమ్స్‌

August 04, 2026


img

ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన నితిన్‌కు చాలా కాలంగా సరైన హిట్ పడటం లేదు. సినీ హీరోలకు ఇది మామూలే కనుక విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలాంటిదే ‘అలియాస్ రుక్మిణి.’

మురళీ కాంత్ దేవాసోత్ కథ, దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. రుక్మిణి అనే పేరుతో సెక్స్ కథలు వ్రాసే రచయితగా నితిన్‌ నటిస్తున్నాడు. అయితే రుక్మిణి ఎవరు? అనే ప్రశ్నకు ‘నా భార్య’ అంటూ నితిన్‌ డైలాగ్‌తో ముగించి చిన్న సస్పెన్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: మురళీ కాంత్ దేవాసోత్; సంగీతం: విజయ్ బుల్గానిన్; కెమెరా: జోమన్ టి. జాన్; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; ప్రోమో షూట్: దినేష్ పురుషోత్తమన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా చేశారు.

యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పణలో దీప్తి గంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష