ప్రశాంత్ కిషోర్ కల నెరవేరింది

August 04, 2026


img

ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్, జన సూరజ్ పార్టీ ఏర్పాటు చేసుకొని గత ఏడాది బిహార్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. దేశంలో అనేక పార్టీలను గెలిపించిన ఆయన తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోగా తాను కూడా ఓడిపోయారు. దీంతో అయన నవ్వులపాలయ్యారు. అయితే బిహార్‌ శాసనసభలో అడుగుపెట్టాలనే తన కల నెరవేర్చుకున్నారు. 

బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్ రాజ్యసభకు ఎంపికవడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ తన సమీప బిజేపి అభ్యర్ధి నీరజ్ కుమార్‌పై 19,324 ఓట్ల ఆధిఖ్యతతో విజయం సాధించారు. 

ఆ నియోజకవర్గం నుంచి నితిన్‌ నబీన్ వరుసగా ఐదుసార్లు గెలిచారు. అంటే 1995 నుంచి అక్కడ బిజేపి గెలుస్తోంది. బిజేపికి అంత బలమున్న చోట ఆ పార్టీ ఓడిపోవడం, ప్రశాంత్ కిషోర్ గెలవడం రెండూ విశేషమే. ఏది ఏమైనప్పటికీ, ప్రశాంత్ కిషోర్ శాసనసభలో అడుగుపెట్టాలనే తన కల ఈవిధంగా నేరవేర్చుకోగలిగారు. 


Related Post