తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ ప్రాజెక్టు పనులు ఈ ఏడాది దసరా (అక్టోబర్ 20) నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని మొదటి దశ పనుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)రూ.4,500 కోట్లు రుణం త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కనుక ఏడీబీ ఈ నిధులు విడుదల చేయగానే, దాని మార్గదర్శకాల ప్రకారం మూసీ ప్రాజెక్టు మొదటి దశ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు మొదటి దశలో గాంధీ సరోవర్ వరకు మొత్తం రూ.7,345 కోట్లు వ్యయంతో 21 కిమీ మేర పనులు చేపట్టేందుకు మంత్రివర్గ సమావేశంలో ఇదివరకే ఆమోదముద్ర వేశారు.
దానిలో ఏడీబీ రూ.4,500 కోట్లు రుణం మంజూరు చేస్తోంది కనుక మిగిలిన సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిమీ, హిమాయత్ సాగ ర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిమీ పనులు పూర్తిచేస్తారు.