జోగినిల ఉసురు రాష్ట్రానికి మంచిది కాదు: జోగిని శ్యామల

August 02, 2026
img

నేడు సికింద్రాబాద్‌, ఉజ్జయినీ మహంకాళి (లష్కర్) బోనాల జాతర సందర్భంగా పలువురు శివసత్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. కానీ తమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోగా కనీసం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. 

వేలాదిమంది శివసత్తులు వస్తే కేవలం ఐదుగురికి మాత్రమే ప్రత్యేక దర్శనం కోసం పాసులు ఇచ్చారని, మిగిలినవారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. 

ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మేము మా జీవితాలను అమ్మవారి సేవకే అంకితం చేశాము. మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఇలాగే ఉంటాము. అమ్మవారి సేవకు అంకితమైన మా పట్ల ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మాకు చాలా బాధ కలిగిస్తోంది. మా కన్నీళ్ళు రాష్ట్రానికి అరిష్టం కనుక మేము మా బాధని మాలోనే అణచుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. 

గత ప్రభుత్వంలో మా పట్ల గౌరవం ఉన్న అధికారులు మాకు తగు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఇది సరికాదు. మాలో అందరూ బాగా చదువుకున్నవాళ్ళమే ఉన్నారు. కానీ ఆలయ కమిటీలలో మాకు అవకాశం కల్పించడం లేదు.

 బోనాలు కేవలం రాజకీయ నాయకులు, పోలీసుల కార్యక్రమం అనుకుంటున్నట్లున్నారు. కానీ మేము బోనాలు ఎత్తినప్పుడే అసలైన పండుగ,” అని జోగిని శ్యామల అన్నారు. 

Related Post