కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో నీట్ అంశంపై నెలరోజుల పాటు ఢిల్లీలో సాగిన ఆందోళనలు విజయవంతమైన తర్వాత ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విద్యార్ధులను ఉద్దేశ్యించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి వికెట్ పడిందని, ఇంకా చాలా వికెట్స్ తీస్తామన్నట్లు మాట్లాడారు. మర్నాడు కూడా ఇంచుమించు అదేవిధంగా ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కనుక సీజేపీ భవిష్య కార్యాచరణకు మళ్ళీ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెల 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని తన నివాసంలో సీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నట్లు అభిజీత్ దీప్కే మీడియాకు తెలియజేశారు.
నీట్ ఆందోళనలలో పాల్గొన్న విద్యార్ధులపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తేస్తామని హామీ ఇచ్చి మాట తప్పినందుకు కేంద్ర ప్రభుత్వంపై మళ్ళీ ఏవిధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశంఫై ఈ సమావేశంలో చర్చిస్తామని అభిజీత్ దీప్కే తెలిపారు. సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తామని తెలిపారు.