గోదావరి శాంతించింది.. భద్రాచలం సేఫ్!

August 02, 2026
img

భద్రాచలం వద్ద గోదావరి నది క్రమంగా శాంతిస్తోంది. గత రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన వరద నీరు ఆదివారం నుంచి తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఉదయం 10 గంటలకు భద్రాచలం వద్ద 46.7 అడుగుల ఎత్తున ప్రవహించింది కానీ క్రమంగా వరద ఉదృతి తగ్గుముఖం పట్టడంతో జిల్లా అధికారులు రెండో ప్రమాద హెచ్చరికని ఉపసంహరించినట్లు ప్రకటించారు. కానీ మధ్యాహ్నం రెండు గంటలకు 42 అడుగులపైనే నీరు ప్రవహిస్తోంది. కనుక మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అదివారం సాయంత్రానికి వరద ఉదృతి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కనుక భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో రోడ్లపైకి వచ్చిన నీరు తగ్గుముఖం పడుతుండటంతో గ్రామస్తులు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బూర్గంపాడు మండలంలోని పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళిన సారపాక, మోతే గ్రామస్తులు తిరిగి ఇళ్ళకు చేరుకుంటున్నారు. 

గోదావరి వరద ఉదృతి తగ్గినప్పటికీ ఇంకా ప్రవాహ ఉదృతి తగ్గలేదు కనుక ఘాట్‌ల వద్ద పోలీసులు గస్తీ కాస్తూ ఎవరినీ నదీ స్నానాలకు అనుమతించడం లేదు. 

Related Post