మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిఎం రేవంత్

August 02, 2026
img

నేడు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆనవాయితీ ప్రకారం ఆలయ నిర్వాహకులు సిఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రభుత్వం తరపున అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి వేదాశీర్వచనాలు పొందారు. 

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జి జగదీశ్ రెడ్డి, అంబార పేట బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్‌, బిజేపి ఎంపీలు, నేతలు కూడా నేడు అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు.  

Related Post