గోపీచంద్ కొత్త సినిమాకి కొత్త పిల్ల.. కొత్త దర్శకుడు!

August 02, 2026


img

గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘భరత వర్ష’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీ చంద్‌కు జోడీగా రీతూవర్మ చేస్తోంది. భరత వర్ష షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 

ఇది చేస్తుండగానే శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్:39గా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మించబోతున్న సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. కొత్త దర్శకుడు సాయి కుమార్‌తో  చేయబోతున్న ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా కేరళకు చెందిన మీనాక్షి దినేశ్ నటిస్తున్నారు. 

ఇప్పుడు గోపీచంద్ మరో సినిమాని లైన్లో పెట్టారు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వం చేయబోతున్నారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా కేరళకు చెందిన అనార్కలి నాజర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. త్వరలోనే దీనికీ పూజా కార్యక్రమం నిర్వహించి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.  


Related Post

సినిమా స‌మీక్ష