శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ, ప్రియ భవానీ శంకర్, బేబీ నక్షత్ర ప్రధాన పాత్రలు చేస్తున్న ‘ఇరుముడి’ నుంచి రెండవ పాట విడుదల కాబోతోంది. ‘ఎలాలోయాలలో...’ అంటూ సాగే పాట సోమవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక చక్కటి పోస్టర్ వేశారు.
ఈ సినిమాలో రవితేజ భార్యగా నటిస్తున్న ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా నటిస్తున్న బేబీ నక్షత్రలతో వేసిన పోస్టర్ చాలా సహజంగా ఆకట్టుకుంటోంది.
ఇరుముడి తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే స్పష్టమైంది. తాజా పోస్టర్‌తో అదే తెలియజేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్ లక్షణ్, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్న ఇరుముడి ఇరుముడి ఆగస్ట్ 21నే విడుదల కాబోతోంది.