మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభోత్సవం కాబోతోంది. విశాఖ నగరానికి సమీపంలో భోగాపురం వద్ద కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ఉదయం ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు.
దీనిని రూ. 4,750 కోట్లు వ్యయంతో 2,203 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఏడాదికి 1.80 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా దీనిని నిర్మించారు. దీనిలో 40 చెక్ ఇన్ కౌంటర్లు, 10 ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అత్యంత భారీ విమానాలు కూడా ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు వీలుగా 3.8 కిమీ పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రెండు రన్‌వేలు నిర్మించారు.
ఈ విమానాశ్రయానికి అనుబంధంగా 25 ఎకరాలలో విమానాల మరమత్తులు, ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని కూడా నిర్మించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రా సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవిధంగా వేలాదిమందితో కళా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. సుమారు మూడు లక్షల మంది సమక్షంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం కానుంది.
<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించబడుతుంది. ఇది అనుసంధానం, వాణిజ్యం మరియు పర్యాటకాన్ని పెంపొందించే ఒక ఆధునిక, భవిష్యత్ తరహా విమానాశ్రయం. సుస్థిరత మరియు ఇంధన సామర్థ్య సూత్రాలను ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు. <a href="https://t.co/iFTdMk5g4r">pic.twitter.com/iFTdMk5g4r</a></p>— Narendra Modi (@narendramodi) <a href="https://x.com/narendramodi/status/2083150421766570288?ref_src=twsrc%5Etfw">July 31, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>