సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆలయం చుట్టూ రెండు కిమీ పరిధిలో ఆగస్ట్ 2 నుంచి 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కనుక ఈ మూడు రోజులు నగర ప్రజలు తాము సూచించిన మార్గాలలో లేదా ప్రత్యామ్నాయ మార్గాలలో గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.
పొగాకు బజార్, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్ రోడ్లను ఈ మూడు రోజులు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయం వైపు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలియజేశారు. ప్యాట్నీ, ప్యారడైజ్, రాణీగంజ్, ఘాస్ మండి బైబిల్ హౌస్, కర్బాలా ప్రాంతాలలో వాహనాలను ఇతర మార్గాలలోకి మళ్ళించబోతున్నారు.
హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, వెస్లీ కాలేజీ, జింఖానా గ్రౌండ్స్, స్వప్నలోక్ కాంప్లెక్స్, మరో 14 ప్రాంతాలలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. కనుక భక్తులు తమ వాహనాలను అక్కడే నిలిపివేసి కాలి నడకన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది.
#HYDTPinfo
🚨 Traffic Advisory – Sri Ujjaini Mahankali Bonalu Jatara, Secunderabad 🚨
In view of the Sri Ujjaini Mahankali Bonalu Jatara, traffic diversions will be in force from 02.08.2026 until the completion of the Jatara on 04.08.2026 within a 2 km radius of the Ujjaini… pic.twitter.com/Lk1cqaeNgD