పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

July 31, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్ను మూశారు. నాలుగు రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అయన పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

గురువారం అర్దరాత్రి అయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని వైద్యులు తెలియజేశారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సీనియర్ నేతలు హరీష్‌ రావు తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి మరణ వార్త తెలుసుకొని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు యశోదా ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. 

పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రం. ఆయనకు భార్య (స్వప్న) ఇద్దరు పిల్లలు నిదర్శన రెడ్డి, ధర్మిష్ట ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం అయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి. 


Related Post