టాలీవుడ్‌లో అందుకు సిద్ధపడాల్సిందే! వెంకీ అట్లూరి

July 30, 2026

img

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే రోజుకి 8 గంటలే షూటింగ్‌లో పాల్గొంటాననే షరతుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల ‘హాలీవుడ్ రిపోర్టర్- ఇండియా’ తరపున జర్నలిస్ట్ అనుపమ్‌ చోప్రా ఇదే ప్రశ్న దర్శకుడు వెంకీ అట్లూరిని అడిగారు. దానికి అయన చెప్పిన సమాధానం చాలా సహేతుకంగా, హుందాగా ఉంది.

“టాలీవుడ్‌లో ప్రతీరోజు ఉదయం 8 గంటలకల్లా అందరూ సెట్స్‌లో ఉంటారు. రోజుకి సుమారు 10-12 గంటలపాటు అందరూ పని చేస్తారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయమే పనిచేయాల్సి వస్తుంది. సినిమా నిర్మాణంలో అవసరాన్ని బట్టి పనిచేయాలి.

ఆవిధంగా పని చేసేందుకు సిద్ధపడినవారే ఇక్కడ నిలబడగలరు. కనుక టాలీవుడ్‌లో పని చేయలనుకునేవారు ఇక్కడి పద్దతులు తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోవడం తప్పనిసరి.

ఒకవేళ నేను బాలీవుడ్ లేదా మరో సినీ పరిశ్రమలో పనిచేయాల్సి వస్తే, ముందుగా అక్కడి పద్దతుల గురించి తెలుసుకుంటాను. వాటిని పాటిస్తాను. ఒక్కో సినీ పరిశ్రమలో ఒక్కో రకమైన పని విధానం ఉంటుంది. వాటికి కట్టుబడి పనిచేయడం తప్పనిసరి,” అని అన్నారు.

టాలీవుడ్‌ పనిగంటలు తనకు సెట్ కావని దీపికా పడుకునే చెప్పారు కనుక కల్కి-2, స్పిరిట్ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలను వదులుకోక తప్పలేదు. అందుకు ఆమె ఆ తర్వాత ఎప్పుడో తాపీగా బాధ పడకుండా ఉండగలిగితే మంచిదే!

Q: #DeepikaPadukone out from Kalki2 & Spirit. Why is different working style compared to Telugu and Bollywood❓#VenkiAtluri: If I'm doing Bollywood film, i will learn culture & working standards there, after that will stat. In same way If Bollywood Actor comes to Telugu, they… pic.twitter.com/3xIlfd5QFC
— AmuthaBharathi (@CinemaWithAB) July 30, 2026

Related Post

సినిమా స‌మీక్ష