ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ గాథ ఆధారంగా రెండు భాగాలుగా రామాయణ రూపొందుతోంది.
శ్రీరాముడుగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, సీతమ్మగా టాలీవుడ్ నటి సాయి పల్లవి నటిస్తున్న రామాయణ మొదటి భాగం ట్రైలర్ తెలుగుతో సహా అన్ని భాషలలో విడుదలైంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రావణుడి పాత్రలో కన్నడ నటుడు యష్ ఆదరగొట్టేశారు.
ఈ సినిమాలో హనుమంతుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, లక్ష్మణుడుగా రవీ దుబే, అరుణ్ గోవిల్ దశరథుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అలాగే 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌జీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పనిచేస్తోంది. దాని పనితనం ట్రైలర్‌లో అడుగడుగునా కనిపించింది.
రామాయణ మొదటి భాగం ఈ ఏడాది దీపావళి (నవంబర్ 8)న, రెండో భాగం వచ్చే దీపావళికి విడుదల కాబోతోంది.